: కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వదు: కేకే
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వదని ఆ పార్టీని వీడిన మాజీ ఎంపీ కె. కేశవరావు స్పష్టం చేసారు. ఇంకా తాను కాంగ్రెస్ పార్టీలో కొనసాగితే తెలంగాణలోని ప్రజలను మోసం చేసినట్టేనని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు వ్యతిరేకంగా మారిందన్న కేకే, ప్రత్యేక తెలంగాణ కోసం తన శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. ఇంకా ఎందరు ఎంపీలు పార్టీ మారనున్నారన్న ప్రశ్నకు ఎవరి అభిప్రాయాలు వారివని, తమతో పాటూ వస్తే స్వాగతిస్తామని అన్నారు.