: మధుమేహానికి చెక్‌ పెట్టొచ్చు


వయసు మీదపడేకొద్దీ వచ్చే వ్యాధుల్లో మధుమేహం ఒకటి. ఈ వ్యాధి వచ్చిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటిగా అన్ని అవయవాలమీద ఇది ప్రభావం చూపుతుంది. టైప్‌ 1 మధుమేహం అనేది ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే కణాలనేగాకుండా ఆ కణాలకు ఆధారంగా నిలిచే రక్తనాళాలను కూడా ధ్వంసం చేస్తుందని మిస్సౌరి విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వ్యాధిని అదుపులో ఉంచేందుకు మూలకణాలతో కూడిన చికిత్సను శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

ఐజీ-జీఏడీ2 అనే ఔషధాన్ని మూలకణాలతో కలిపి ప్రయోగించడం ద్వారా మధుమేహాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొనవచ్చని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ చికిత్స ద్వారా మధుమేహం అదుపులో ఉంటోందని వారు తెలిపారు. ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన హబీబ్‌ జగౌని మాట్లాడుతూ ఐజీ-జీఏడీ2 ఔషధం మధుమేహ రోగుల్లో ఇన్సులిన్‌ ఉత్పాదక కణాలు రోగనిరోధక వ్యవస్థపై దాడి చేయకుండా నిరోధిస్తుందని, ఈ ఔషధాన్ని ఎముక మూలుగ నుండి తీసుకున్న మూలకణాలతో కలిపి ప్రయోగించడం వల్ల మూలకణాలు రక్తనాళాలను పునరుద్ధరిస్తున్నాయని అన్నారు. ఫలితంగా ఇన్సులిన్‌ ఉత్పత్తి కణాల సంఖ్య పెరగడం సాధ్యమవుతుందని ఆయన అంటున్నారు.

  • Loading...

More Telugu News