: దానగుణంలో మగువలకన్నా మగవారేమిన్న!


సహజంగానే ఆడవారికి దయాగుణం ఎక్కువంటారు. అయితే వారిలో దానగుణం మాత్రం తక్కువేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎవరికైనా దానం చేయాలంటే మగువలకన్నా మగవారే త్వరగా స్పందిస్తారట. తమవంతు సాయం చేయడానికి ముందుకొస్తారని తాజా అధ్యయనం చెబుతోంది. షికాగో విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు మగువల్లోను, మగవారిలోను ఉండే దానగుణం గురించి ప్రత్యేకంగా ఒక అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ అధ్యయనంలో తేలిన విషయం ఏమంటే మగవారికన్నా మగువలు వితరణ విషయంలో వెనుకంజ వేస్తారని తేలింది.

ఎవరైనా విరాళాల కోసం వస్తే వారిని కలవకుండా ఉండడం, కాలింగ్‌ బెల్‌ మోగించినా కూడా ఉలుకూ పలుకూ లేకుండా ఉండడం వంటి పనులు మగవారికన్నా మగువలకు సులభమేనని తేలింది. ఎవరైనా విరాళాల సేకరణకు వస్తున్నామని ముందుగానే గనుక సమాచారాన్ని అందించినట్టయితే మహిళలకన్నా మగవారే సత్వరం స్పందించారని, ఒకవేళ ఎవరైనా చెప్పాపెట్టకుండా హఠాత్తుగా వెళ్లి విరాళాలు అడిగితే తక్కువ మంది స్త్రీలు సానుకూలంగా స్పందించారని ఈ అధ్యయనంలో తేలినట్టు పరిశోధకులు చెబుతున్నారు. అయితే ఈ వితరణ గుణంపై మరింత లోతుగా పరిశోధనలు చేయాల్సి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News