: ఇప్పుడు హోం శాఖను నిర్వహించడం సవాలే: జానారెడ్డి
కాంగ్రెస్ పార్టీని వీడే ప్రశ్నేలేదని పంచాయతీరాజ్ శాఖా మంత్రి కే జానారెడ్డి స్పష్టం చేశారు. పార్టీలో ఉంటూనే తెలంగాణ కోసం పోరాటం చేస్తానన్నారు. కేకే, వివేక్, మందా, వినోద్ ల వలస ప్రభావం ఎన్నికల్లో తెలుస్తుందన్నారు. ఈ ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందన్నది ఇప్పుడే అంచనా వేయలేమన్నారు. తెలంగాణ ఆకాంక్షపై ఎప్పటికప్పుడు అధిష్ఠానంతో చర్చిస్తున్నామని తెలిపిన జానా, హోం శాఖ కోసం తాను ప్రయత్నాలు చేయడం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో హోం శాఖను నిర్వహించడం అంత సులభం కాదన్నారు. అలాగే, సీఎం పదవిలో కూడా ఏమీ లేదనుకుంటున్నానని తెలిపారు. పంచాయతీ ఎన్నికలపై చర్చించామని, మూడు రోజుల్లో బీసీ నివేదిక రాగానే దాన్ని ఈసీకి పంపిస్తామని తెలిపారు. జూలైలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని జానారెడ్డి తెలిపారు.