: ఆ నలుగురూ భేటీ


టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖరరావు హైదరాబాద్ లో కాంగ్రెస్ ఎంపీ వివేక్ నివాసానికి చేరుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్ ఎంపీలు వివేక్, మంధా జగన్నాథం, రాజయ్యలతో కేసీఆర్ మంతనాలు జరుపుతున్నారు. వాస్తవానికి ఈ ముగ్గురు ఎంపీలు టీఆర్ఎస్ లో చేరడానికి ఇప్పటికే నిర్ణయించుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. దీనిని అధికారికంగా ఎవరూ ధ్రువీకరించలేదు. అయితే తెలంగాణపై అధిష్ఠానం సత్వరమే తేల్చకుంటే పార్టీని వీడుతామని ఇప్పటికే ప్రకటించి ఉన్నారు. తాజా భేటీ తర్వాత వీరు కాంగ్రెస్ కు రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరవచ్చని సమాచారం. వీరిని ఎలాగైనా చేర్చుకోవాలన్న ఉద్దేశంతోనే చంద్రశేఖరరావు వివేక్ నివాసానికి వచ్చినట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News