: బాసర క్షేత్రం భక్తులతో కిటకిట


ఈ రోజు వసంత పంచమి, సరస్వతీ దేవి పుట్టిన రోజు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రసిద్ద పుణ్యక్షేత్రం బాసరకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. ఇప్పటికే చదువుల తల్లి దర్శనం కోసం రెండు కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరి ఉన్నారు. అర్చక స్వాములు తెల్లవారు జామునే అమ్మవారికి ప్రత్యేక అభిషేకం, పూజలు నిర్వహించారు. అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే, సరైన ఏర్పాట్లు లేకపోవడంతో భక్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరోవైపు తిరుమల, భద్రాచలం, అన్నవరం, బెజవాడ దుర్గమ్మ తదితర ఆలయాలలోనూ భక్తుల రద్దీ కొనసాగుతోంది. 

  • Loading...

More Telugu News