: సంజయ్ 'పోలీస్ గిరీ'కి ప్రియాదత్ ప్రచారం
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ సోలో హీరోగా నటించిన 'పోలీస్ గిరి' సినిమాను సంజయ్ దత్ సోదరి, కాంగ్రెస్ ఎంపీ ప్రియాదత్ ప్రమోట్ చేయనున్నారు. 1993 ముంబై పేలుళ్ల కేసులో ఆయన ఎరవాడ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. కాగా ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రియాదత్ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసారు. ఈ సందర్భంగా ఈ సినిమాలో పనిచేసిన వారందర్నీ అభినందించారు. తన సోదరుడు లేని లోటును తాను భర్తీ చేస్తానని, సినిమాను ప్రేక్షకుల దగ్గరకు తీసుకువెళ్లేందుకు నిర్మాత అగర్వాల్ కు పూర్తి సహకారమందిస్తానని ప్రియాదత్ తెలిపారు.