: డబ్బింగ్ సీరియల్స్ పై తమిళ టీవీ ఆర్టిస్టుల పోరు
తెలుగు టీవీ సీరియల్ నటులు చేసిన ఆందోళనలు ఇప్పుడు పొరుగు రాష్ట్రాలకు పాకాయి. హిందీ డబ్బింగ్ సీరియల్స్ ప్రసారాలను నిలిపివేయాలంటూ తమిళ్ సినీ ఆర్టిస్టుల సంఘం కూడా పోరుబాట పట్టింది. హిందీ డబ్బింగ్ సినిమాలను నిలిపివేయాలని ఛానల్స్ కు తమిళ టీవీ ఆర్టిస్టుల సంఘం నోటీసులిచ్చింది.
ఆంధ్రప్రదేశ్ తరహాలో డబ్బింగ్ సీరియల్స్ పై నటి, రాడాన్ సంస్ధ అధినేత్రి రాధికా శరత్ కుమార్ పోరాటానికి దిగారు. దక్షణభారత చలన చిత్ర కార్మికుల సమాఖ్య (ఫెప్సీ) నుంచి తప్పుకుంటున్నట్టు తమిళ్ టీవీ ఆర్టిస్టుల సంఘం తెలిపింది. మరో కొత్త యూనియన్ ను ప్రారంభిస్తామని రాధిక ఈ సందర్భంగా తెలిపారు. అనువాద సీరియల్స్ తో స్థానికి టీవీ ఆర్టిస్టులు ఉపాధి కోల్పోతున్నారని ఆమె తెలిపారు.