: ఆక్సిజన్ లేకుండా ఎవరెస్టు అధిరోహించిన తొలి వ్యక్తికి సన్మానం


ఎవరెస్టు శిఖరారోహణ వజ్రోత్సవ వేడుకలను నేపాల్ ప్రభుత్వం నిర్వహించింది. తొలిసారిగా ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించి ఇవాల్టికి 60 సంవత్సరాలైన సందర్భంగా ఈ ఘనత సాధించిన పర్వతారోహకులందర్నీ నేపాల్ ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. ఎడ్మండ్ హిల్లరీ, టెన్సింగ్ నార్కే తరువాత వారి జాడలో నడిచి ఎవరెస్టును అధిరోహించిన వారు ఈ సన్మానకార్యక్రమంలో పాల్గొన్నారు. వీరిలో ఇటలీకి చెందిన రీన్ బోల్డ్ మెస్నర్ ప్రముఖుడు. ఈయన ఆక్సిజన్ లేకుండా ఎవరెస్టును అధిరోహించిన తొలి వ్యక్తి. అంతేకాదు, మరో 14 ఎత్తైన శిఖరాలను అధిరోహించిన అరుదైన రికార్డు కూడా ఈయన సొంతం చేసుకున్నారు. పూలమాలలు, స్కార్ఫ్ లతో సన్మానించి గుర్రపుబగ్గీలపై ఖాట్మాండులోని ప్రధాన వీధుల్లో వీరిని గౌరవంగా ఊరేగించారు.

  • Loading...

More Telugu News