: గురునాథ్ కస్టడీ ఈ నెల 31 వరకూ పొడిగింపు
స్పాట్ ఫిక్సింగ్ కేసులో అరెస్టయిన కీలక వ్యక్తి గురునాధ్ మెయ్యప్పన్ కు ముంబై కోర్టు పోలీస్ కస్టడీని ఈ నెల 31 వరకూ పొడిగించింది. మెయ్యప్పన్ నుంచి మరింత కీలక సమాచారం సేకరించాల్సి ఉందని, మరి కొన్ని రోజులు అతన్ని తమ కస్టడీలో ఉంచితే మరింతమంది పెద్దలు బయటపడే అవకాశముందని కోర్టును పోలీసులు అభ్యర్ధించడంతో పోలీసుల వాదనతో ఏకీభవించిన కోర్టు ఈ నెలాఖరు వరకూ రిమాండు పొడిగిస్తూ పోలీసు కస్టడీకి అప్పగించింది. ఇప్పటికే మెయ్యప్పన్ ఇచ్చిన సమాచారంతో అతని ఇంటిలో మూడు సార్లు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో మరింత కీలక సమాచారం సేకరించినట్టు పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి.