: మరో అల్పపీడనం.. వర్షాలకు అవకాశం
ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయుగుండంగా మారే అవశాలున్నాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. దీనికితోడు ఉపరితల అల్పపీడన ద్రోణి కూడా కొనసాగుతోందని.. దీనివల్ల రానున్న 24 గంటల్లో అక్కడక్కడా వర్షాలు పడతాయని తెలిపింది. తీరం వెంట గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది.