: 'అలవాట్ల వల్లే 69 శాతం మంది చనిపోతున్నారు'


మనుషులకు ఉన్న చెడు అలవాట్ల వల్లే 69 శాతం మంది చనిపోతున్నారని స్విట్జర్లాండ్ జెనీవాలో డబ్ల్యూహెచ్ వో తెలిపింది. అవసరాలకు, సౌకర్యాలకు తేడా తెలియని మనుషులు చెడు అలవాట్లబారిన పడడంతో ఎక్కువ మంది చనిపోతున్నారని, అమితాహారం వల్ల కూడా ఎక్కువ శాతం మంది చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. మృతి చెందుతున్న వారిలో 69 శాతం మంది అనారోగ్య కారణాలవల్లే చనిపోతున్నారని స్పష్టం చేసింది. ప్రధానంగా వీరి మరణానికి మద్యం, పొగత్రాగడం, అమితాహారం ఎక్కువ కారణాలని తెలిపింది. అలవాట్లకు బానిసలైనవారూ తస్మత్ జాగ్రత్త!

  • Loading...

More Telugu News