: మెరుగవుతున్న శుక్లా ఆరోగ్యపరిస్థితి
మావోయస్టుల దాడిలో గాయపడిన కాంగ్రెస్ మాజీ మంత్రి వీసీ శుక్లా పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని ఢిల్లీ గుర్గావ్ లో ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉన్నప్పటికీ ఆయన ధైర్యంగా ఉన్నారని, అందువల్ల ఇన్టెన్సివ్ కేర్ లో వెంటిలేటర్ పై ఉన్నప్పటికీ స్పృహ లోనే ఉన్నారని వైద్యులు తెలిపారు. అయితే వృద్దాప్యం కారణంగా కోలుకునేందుకు కొంత సమయం పడుతుందన్నారు. ఒక రకంగా చూస్తే ఆయన పరిస్థితి మెరుగవుతుందని తెలిపారు.