: గిన్నిస్ బుక్ ని ఆకట్టుకున్న 'ముద్దు' ముచ్చట


జిహ్వకో రుచి... పుర్రెకో బుద్ధి... అన్నారు పెద్దలు. ఒక్కొక్కళ్లది ఒక్కో పిచ్చి. అలాగే నిండా ప్రేమలో మునిగిపోయిన జంటలకు కూడా రకరకాలా పిచ్చి వుంటుంది. అందుకే, వేలంటైన్స్ డే సందర్భంగా సరదాగా... తమాషాగా ముద్దుల పోటీ పెట్టుకున్నారు. ఏ జంట ఎక్కువ సేపు ఈ చుంబన క్రియలో మునిగిపోతే.... ఆ జంట రికార్డు సాధించినట్టు. థాయిలాండులోని పట్టాయ్ నగరంలో ఈ నెల 12 న ప్రారంభమైన ఈ సుదీర్ఘ చుంబన పోటీలలో తొమ్మిది జంటలు ఉత్సాహంగా పాల్గొన్నాయి.

పోటీ ప్రారంభం కాగానే, ఏ జంటకా జంట పెదవులు ముద్దాడుకుంటూ వాటేసుకున్నారు. ఆఖరికి అకేకాచై తరానత్, రాక్సనా తనారత్ అనే దంపతులు ఈ గాఢ చుంబన పోటీలో గెలుపొందారు. ఈ జంట ఏకంగా 58 గంటల 35 నిమిషాల 58 సెకండ్ల పాటు ముద్దులో మునిగిపోయి ... ముద్దుకే ముద్దొచ్చేశారు. నిజంగానే ఇది ప్రపంచ రికార్డు అంటూ వీరి ముద్దు వైనాన్ని గిన్నిస్ బుక్ వారు నమోదు చేసేశారు.

  • Loading...

More Telugu News