: ఆర్టీసీ ప్రయాణీకులపై టోల్ బాదుడు


జాతీయ రహదారులపై తిరిగే ఆర్టీసీ బస్సుల్లో టోల్ రుసుం పెరిగింది. ఈ పెంచిన రుసుం తక్షణం అమలులోకి రానున్నది. టోల్ రుసుం పెంచాలన్న ఆర్టీసీ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఒక్కో టోల్ గేటు దగ్గర ఒక్కో వ్యక్తి నుంచి 4 రూపాయాలు వసూలు చేయనున్నారు. సూపర్ లగ్జరీ, ఇంద్ర, గరుడ బస్సుల్లో 5 రూపాయలు వసూలు చేయనున్నారు. గరుడ ప్లస్, వెన్నెల, వెన్నెల ప్లస్ బస్సుల్లో ఒక్కొక్కరి దగ్గర్నుంచి 6 రూపాయల చొప్పున వసూలు చేయనున్నారు. దీనిపై పలు సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. టోల్ ఛార్జీలు పెంచడానికి రోడ్లు ఇప్పడు వేసినవి కాదని, కానీ ప్రభుత్వం అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News