: విందూ దారా సింగ్ కు నెలాఖరు వరకూ పోలీసు కస్టడీ
ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారాన్ని కీలక మలుపు తిప్పిన బాలీవుడ్ నటుడు విందూ దారాసింగ్ కస్టడీని ముంబై న్యాయస్థానం పొడిగించింది. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో ముగ్గురు క్రికెటర్లు అరెస్టయిన తరువాత శ్రీశాంత్ విచారణలో విందూ దారాసింగ్ పేరు బయటపెట్టాడు. ఇతను అప్పటి పోలీసు విచారణలో గురునాథ్ పేరు ప్రముఖంగా బయటపెట్టడంతో ఈ కేసులో కీలక వ్యక్తిగా మారాడు. అదీ కాక బుకీలతో నేరుగా సంబంధాలు విందూకే ఉన్నందున ముంబై కోర్టు విందూ దారాసింగ్ కు ఈ నెల 31 వరకూ పోలీసు కస్టడీని పొడిగించింది.