: రెండు కొత్త రైళ్లు ప్రారంభం


రెండు కొత్త రైళ్లను రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఈ రోజు ప్రారంభించారు. సికింద్రాబాద్-షాలిమార్ వీక్లీ ఎక్స్ ప్రెస్, కాచీగూడ-మధురై వీక్లీ ఎక్స్ ప్రెస్ లను సికింద్రాబాద్, కాచీగూడ స్టేషన్లలో మంత్రి జెండా ఊపి ప్రారంభిచారు. మరిన్ని కొత్త రైళ్లు త్వరలోనే ప్రారంభమవుతాయని సూర్యప్రకాశ్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు. కాజీపేట, కర్నూలులో వ్యాగన్ల కర్మాగారాల ఏర్పాటుకు భూసేకరణ పూర్తయిందని వెల్లడించారు.

  • Loading...

More Telugu News