: కేక్ ఇచ్చేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు
ప్రియురాలి పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు కేక్ ఇవ్వడానికి సంతోషంగా వెళ్లిన ప్రియుడు అక్కడి నుంచి పైలోకానికి వెళ్లిపోయాడు. ప్రియురాలి మేనమామ కోపంతో కేక్ తెచ్చిన యువకుడిని చంపి ఇంటి ముందే పాతిపెట్టాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా గార్లదిన్నెలో జరిగింది. పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు.