: మహరాష్ట్ర కరవు ప్రాంతాల్లో రాహుల్ పర్యటన


మహరాష్ట్రలోని కరవు ప్రాంతాలను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంథీ సందర్శించనున్నారు. మహారాష్ట్రలోని మరట్వాడా ప్రాంతం తీవ్ర దుర్భిక్షంలో కొట్టుమిట్టాడుతోంది. ఇక్కడి ప్రజలు నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో పాటూ ఇక్కడ పండించుకునేందుకు నీటి వనరులు లేకపోవడానికి తోడు గుక్కెడు త్రాగునీరు లేక తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. కరవు పీడిత ప్రాంతాల్లో పర్యటించేందుకు రేపు యువరాజు రాహుల్ రానున్నారు. రేపటి పర్యటనలో రైతులు, శ్రామికులతో మాట్లాడి వాస్తవ పరిస్థితులు తెలుసుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

  • Loading...

More Telugu News