: బాలికలు భావవ్యక్తీకరణలో వెనుకబడుతున్నారు
బాలికలు ఉత్తీర్ణతలో ముందున్నప్పటికీ... భావవ్యక్తీకరణలో వెనుకబడుతున్నారని రాజీవ్ విద్యామిషన్ డైరెక్టర్ ఉషారాణి అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ గౌలిదొడ్డి సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహంలో 'వాయిస్ ఫర్ గర్ల్స్' అనే కార్యక్రమం చేపట్టారు. రాష్ట్రప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో చదువుతున్న 1200 మంది బాలికలకు కమ్యూనికేషన్ స్కిల్స్, కెరియర్ ప్లానింగ్, సోషల్ లైఫ్, బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. శిక్షణ అనంతరం బాలికలు తమ అనుభవాలను ఇతరులతో పంచుకోవడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని ఉషారాణి తెలిపారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.