: కుటుంబ నియంత్రణతో తగ్గుతున్న హిందువులు: స్వామీ హన్సదేవాచార్య
ప్రేమికుల దినోత్సవం రోజున.. అలాహాబాద్ లోని కుంభమేళా వేదికగా ఈ రోజు ఒక ప్రత్యేక ప్రదర్శన జరిగింది. హిందువులలో కుటుంబ నియంత్రణ విధానాన్ని వ్యతిరేకిస్తూ మహారాష్ట్రకు చెందిన స్వామి నరేంద్రాచార్య శిష్యగణం కుంభమేళా దగ్గర ప్రచారం నిర్వహించారు. నరేంద్రాచార్య సహచరుడు స్వామి హన్సదేవాచార్య ఆధ్వర్యంలో ఇది జరిగింది.
కుటుంబ నియంత్రణ విధానాన్ని పాటించడం వల్ల హిందువుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోందంటూ వారు ఆందోళన వ్యక్తం చేశారు. హిందువులపై కుటుంబ నియంత్రణను బలవంతంగా రుద్దుతున్నారని వివరించారు. దేశ పౌరులందరికీ రాజ్యాంగం ఒక్కటేనని.. అలాంటప్పుడు కొన్ని వర్గాల ప్రజలకు బహుభార్యత్వానికి ( ఇద్దరు అంతకు మించి భార్యలు) ఎందుకు స్వేచ్ఛ కల్పిస్తున్నారని స్వామి హన్సదేవాచార్య ప్రశ్నించారు. మరి అదే అవకాశం హిందువులకు ఎందుకు లేదని అడిగారు. కుటుంబ నియంత్రణ దేశంలో ఒక మతం వర్గానికే కాకుండా అందరికీ వర్తింపజేయాలని స్వామి డిమాండ్ చేశారు.
అయితే, హన్సదేవాచార్య వాదనలను అలహాబాద్ లోని పలు మహిళా సంఘాలు ఖండించాయి. అవన్నీ అబద్దాలుగా పేర్కొన్నాయి. జనాభా గణాంకాల ప్రకారం చూస్తే హిందువుల సంఖ్య తగ్గడం లేదని స్పష్టం చేశాయి. కుటుంబ నియంత్రణ వల్ల సమాజంలో మహిళల పరిస్థితి మెరుగుపడుతుందని పేర్కొంటూ స్వామి నరేంద్రాచార్యకు ఒక లేఖ పంపాయి.