: మీడియాపై బీసీసీఐ అధ్యక్షుడి మండిపాటు


తన రాజీనామా డిమాండ్లను మీడియానే ఉసిగొలుపుతోందంటూ.. బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐపిఎల్ స్ఫాట్ ఫిక్సింగ్ కుంభకోణం అనంతరం బెట్టింగ్ ఆరోపణలపై మేనల్లుడు మయ్యప్పన్ అరెస్ట్ కావడంతో శ్రీనివాసన్ రాజీనామా చేయాలంటూ డిమాండ్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాను రాజీనామా చేయడానికి తగిన కారణాలు లేవని చెన్నైలో మీడియా ప్రతినిధుల ప్రశ్నకు శ్రీనివాసన్ బదులిచ్చారు.

  • Loading...

More Telugu News