Andhra Pradesh: అమరావతి రైతుల మహాపాదయాత్రలో పోలీసుల లాఠీచార్జ్.. విరిగిన రైతు చెయ్యి.. ఇవిగో ఫొటోలు

Police Lathi Charge On Amaravati Farmers Pada Yatra

  • ప్రకాశం జిల్లా చదలవాడ వద్ద ఉద్రిక్తత
  • రైతులను ఎక్కడికక్కడ అడ్డుకున్న పోలీసులు
  • తాళ్లు, చెక్ పోస్టులు పెట్టి బంధనాలు
  • తోసుకుంటూ ముందుకెళ్లిన రైతులు  
  • లాఠీలు ఝళిపించిన పోలీసులు

‘న్యాయస్థానం టు దేవస్థానం’ పేరిట మహాపాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులపై పోలీసులు లాఠీలు ఝళిపించారు. ప్రస్తుతం రైతుల మహాపాదయాత్ర ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది. వారి యాత్ర నాగులుప్పలపాడు మండలం చదలవాడ వద్దకు చేరుకోగానే పోలీసులు అడ్డుకున్నారు. యాత్రకు అనుమతి లేదంటూ నిలువరించారు. ఈ క్రమంలో రైతులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. సంతనూతలపాడుకు చెందిన నాగార్జున అనే రైతు చెయ్యి విరిగింది. ఈ క్రమంలో రైతులను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు.


మరోవైపు రైతుల పాదయాత్రకు స్థానికులూ సంఘీభావం ప్రకటించారు. అయితే, రైతులు వేరే ప్రాంతాల్లో ప్రవేశించకుండా చెక్ పోస్టులను పెట్టి, ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. అయినా కూడా రైతులు ముందుకే కదులుతున్నారు. ఆంక్షల నడుమనే పాదయాత్ర చేస్తున్నారు. ఏపీకి అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.





 



 

  • Loading...

More Telugu News