: సీబీఎస్ఈ ఫలితాలలో మరోసారి అమ్మాయిలదే పైచేయి


సీబీఎస్ఈ పదకొండో తరగతి ఫలితాలు వెల్లడయ్యాయి. ఈసారి కూడా అమ్మాయిలే సత్తా చాటారు. అబ్బాయిలు 77 శాతం ఉత్తీర్ణులైతే.. అమ్మాయిల ఉత్తీర్ణత 87శాతం నమోదు కావడం విశేషం. మొత్తం మీద ఉత్తీర్ణత శాతం 82గా ఉంది. 2012లో ఉత్తీర్ణత శాతం కంటే ఇది 10 శాతం ఎక్కువ. చెన్నై విద్యార్థులు 91 శాతం ఉత్తీర్ణులై రికార్డు సృష్టించారు. మొత్తం మీద పన్నెండో తరగతి పరీక్షలను ఈ ఏడాది 9 లక్షల మందికిపైగా రాశారు. ఫలితాలను www.results.nic.in, www.cbseresults.nic.in and www.cbse.nic.in నుంచి తెలుసుకోవచ్చు.

  • Loading...

More Telugu News