: చల్లబడ్డ రాష్ట్రం.. బంగాళాఖాతంలో అల్పపీడనం .. పలు చోట్ల వర్షాలు


ఎండలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న రాష్ట్ర వాసులకు శుభవార్త. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో వర్షాలు పడుతుండడంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. కర్నూలు జిల్లా ఆలూరు, కృష్ణాజిల్లా జగ్గయ్యపేట, నూజివీడులో పర్షం పడుతోంది. ప్రకాశం జిల్లా సంతమాగులూరులో నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది . తూర్పు గోదావరి జిల్లాలో ఉదయం నుంచీ వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఖమ్మం జిల్లా జూలూరుపాడులో భారీ వర్షం కురుస్తోంది. భద్రాచలం, కొత్తగూడెంలలో చిరుజల్లులు పడుతున్నాయి. అల్పపీడనం ఈ రోజు సాయంత్రానికి బలపడే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో పలుచోట్ల వర్షాలు పడతాయని పేర్కొంది. ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని తెలిపింది.

  • Loading...

More Telugu News