: ఐపీఎల్ చాంపియన్ ముంబయ్ ఇండియన్స్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చాంపియన్ గా ముంబయ్ ఇండియన్స్ అవతరించింది. నిన్న రాత్రి కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన హోరాహోరీ పోరులో చెన్నయ్ సూపర్ కింగ్స్ ను చిత్తుగా ఓడించింది. ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఏకపక్షంగా సాగిన ఫైనల్ మ్యాచ్ లో ముంబయ్ ఇండియన్స్ విజేగా నిలిచి కప్పును ఎగరేసుకుపోయింది.
మొదట బ్యాటింగ్ చేసిన ముంబయ్ ఇండియన్స్ పరిమిత 20 ఓవర్లలో 148 పరుగులు చేయగా ... చెన్నయ్ సూపర్ కింగ్స్ ని 125 పరుగులకే కట్టడి చేసి, 23 పరుగుల తేడాతో ముంబయ్ ఇండియన్స్ మ్యాచ్ ని లాగేసుకుంది. ఈ గెలుపులో మన రాష్ట్రానికి చెందిన అంబటి రాయుడు కీలక పాత్ర పోషించాడు. ఈ కుర్రాడు చేసినవి 37 పరుగులే అయినప్పటికీ జట్టు విజయంలో అవి కీలక పాత్ర పోషించాయి. పోలార్డ్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కించుకున్నాడు.