: ఈ శాలువాను అగ్గిపెట్టెలో పెట్టవచ్చు!


శాలువాను అగ్గిపెట్టెలో పెట్టడం సాధ్యమేనా...? సాధ్యమే అంటున్నారు మన రాష్ట్రానికి చెందిన విజయ్‌. బ్రిటిష్‌ వారి కాలంలోనే మన చేనేత పనివారు అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసి ఘనత వహించారు. అయితే ఆ తర్వాత కాలంలో ఆ కళ మరుగున పడిపోయింది. ఇటీవల కాలంలో ఈ కళ మళ్లీ వెలుగులోకి వస్తోంది. కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు నల్ల పరంధాములు మరమగ్గంపై అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసి గతంలో అనేకమందిని అబ్బురపరచారు. ఇప్పుడు అతని కుమారుడు నల్ల విజయ్‌ అగ్గిపెట్టెలో పెట్టగలిగే శాలువాను నేసి అందరినీ ఆకట్టుకుంటున్నారు. విజయ్‌ మరమగ్గంపై పట్టుపోగులతో సుమారు 30 గ్రాముల బరువు, మీటరున్నర పొడవు కల శాలువాను నేశారు. దీన్ని అగ్గిపెట్టెలో పెట్టవచ్చని చెప్పి చూపిస్తున్నాడు కూడా. అంటే ఆ కాలపు మన చేనేతకు మళ్లీ కళ వస్తోందన్నమాట!

  • Loading...

More Telugu News