: కాఫీ కంట్రోల్‌ లేకుంటే కష్టమే!


కొందరు రోజుకు ఐదారుసార్లు కాఫీ తాగేస్తుంటారు. కాఫీయేకదా... అనుకుంటే అది మీ శరీరంపై ప్రభావం చూపుతుంది. చివరికి మీకు ఊబకాయం వస్తుంది. ఈ విషయాలను ఒక తాజా అధ్యయనం వెల్లడిచేసింది. కాఫీతో కొన్ని రకాలైన ప్రయోజనాలున్నా కూడా, అతి కాఫీ శరీర బరువు పెరగడానికి కారణం అవుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. కాఫీ సేవనం వల్ల కేవలం ఊబకాయమే కాకుండా కొన్ని రకాలైన మొండి వ్యాధులు కూడా వచ్చే ప్రమాదముందని వీరు హెచ్చరిస్తున్నారు.

వెస్టరన్‌ ఆష్ట్రేలియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు కాఫీని పరిమితంగా తీసుకోవాలని, అపరిమితంగా తీసుకుంటే ఇలాంటి సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. కాఫీని అధికంగా సేవించే వారిపై జరిపిన పరిశోధనలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొందరు తాము కెఫీన్‌ రహితమైన కాఫీ తాగుతున్నాం కదా అని అనుకుంటారని, అలాంటి వాళ్లు కూడా జాగ్రత్తగా ఉండాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రోజుకు ఐదారు కప్పుల కాఫీని తాగేవారి ఉదరభాగంలో కొవ్వు పేరుకుపోయినట్లు తమ అధ్యయనంలో తేలిందని వారు తెలిపారు. కాఫీలో ఉండే క్లోరోజెనిక్‌ యాసిడ్‌ (సీజీఏ) కి మధుమేహాన్ని నివారించే లక్షణాలున్నాయని, అయితే దీని మోతాదు మితిమీరితే మాత్రం కొవ్వు పేరుకునే సమస్య ఉత్పన్నమవుతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కాబట్టి కాఫీ వల్ల మేలున్నా... అతిగా సేవించడం మాత్రం ప్రమాదమే!

  • Loading...

More Telugu News