: అంబులెన్స్ డ్రైవర్ ను చితక్కొట్టిన రౌడీ పోలీస్
పోలీసుల అరాచకాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. మొన్న పంజాబ్ లో మహిళని కూడా చూడకుండా ఆ దారిలో వెళ్తున్నందుకు వెనుక నుంచి బాదేశాడో పోలీస్ అధికారి. నిన్నామధ్య ఉత్తరప్రదేశ్ లో ధర్నా చేస్తున్న మహిళను చావబాదాడింకో పోలీసు అధికారి. తాజాగా కడప రాజారెడ్డి వీధిలో అకారణంగా అంబులెన్సు డ్రైవర్ ని చితగ్గొట్టాడింకో రౌడీ పోలీస్. వన్ టౌన్ పోలీసు ఠానా పరిధిలో ప్రైవేటు ఆసుపత్రికి చెందిన అంబులెన్స్ డ్రైవర్ రోడ్డు ప్రక్కన కారు పార్క్ చేసాడు. కనీసం ప్రక్కకు తియ్యి అని చెప్పకుండా చితక్కొట్టేసాడు స్థానిక సీఐ షౌకత్ అలీ. దీంతో స్థానిక అంబులెన్స్ సిబ్బంది, డ్రైవర్లు వన్ టౌన్ పోలీసు స్టేషన్ వద్ద ధర్నా చేపట్టారు.