: కిడ్నాప్ కహానీపై రేపు నోరు విప్పనున్న సనాఖాన్
15 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసేందుకు యత్నించారనే అభియోగాలను ఎదుర్కొంటున్న బాలీవుడ్ తార సనాఖాన్ ఈ రోజు యాంటిసిపేటరీ బెయిల్ కోసం ముంబైలోని స్థానిక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం ఈ పిటిషన్ విచారణకు వస్తుందని, బెయిల్ కూడా దక్కుతుందని సనాఖాన్ భావిస్తోంది. బెయిల్ లభించిన అనంతరం అసలు ఏం జరిగింది? అనే దానిపై సనా తన వాదన వినిపించనున్నట్లు ఆమె సన్నిహిత మిత్రుడు రాజీవ్ పాల్ తెలిపారు. ఏప్రిల్ 30న బాలికను తన కజిన్, స్నేహితుల సాయంతో కిడ్నాప్ కు యత్నించినట్లు నవీ ముంబై పోలీసులు సనాఖాన్ పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.