: మావోయిస్టుల మారణహోమం.. అపహరించిన వారందరి హతం?


మావోయిస్టులు మరోసారి రక్తపాతం పారించారు. నిన్న సాయంత్రం ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లాలో మందుపాతరలు పేల్చి, కాల్పులతో విరుచుకుపడి ఆ రాష్ట్ర పీసీసీ మాజీ అధ్యక్షుడు, సల్వాజుడుం వ్యవస్థాపకుడు మహేంద్రకర్మను హత్య చేశారు. ఈ సందర్భంగానే 17 మందిని కాల్చిచంపారు. ఈ దాడిలో కేంద్ర మాజీ మంత్రి శుక్లా, కుంట ఎమ్మెల్యే సహా 20 మందికి గాయాలయ్యాయి. అనంతరం ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నందకుమార్, ఆయన కుమారుడు దినేష్, మహేంద్ర కర్మ కుమారుడు సహా చాలా మందిని అపహరించుకుపోయారు.

అయితే, వీరిలో నందకుమారుడు, దినేష్ తోపాటు 11 మందిని తర్వాత హతమర్చినట్లు సమాచారం. దీంతో మొత్తం 28 మందిని పొట్టన పెట్టుకున్నారు. నందకుమార్, దినేష్ మృతదేహాలను పోలీసులు గుర్తించారు. అయితే మావోయిస్టుల చెరలో ఇంకా 10 నుంచి 15 మంది వరకూ ఉంటారని ఉంటారని భావిస్తున్నారు. మరోవైపు తీవ్రగాయాలపాలైన శుక్లాను మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి తరలించారు.

  • Loading...

More Telugu News