: ఛత్తీస్ ఘడ్ కాంగ్రెస్ అధ్యక్షుడు కిడ్నాప్
ఛత్తీస్ ఘడ్ సుకుమా జిల్లా కేంద్రంలో పరివర్తన్ బహిరంగ సభ నిర్వహించిన తరువాత కాంగ్రెస్ నాయకులు జగ్దల్ పూర్ కు వెళ్తుండగా మావోయిస్టులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. కాల్పులకు తెగబడ్డారు. సల్వాజుడుం సృష్టికర్త మహేంద్రకర్మకు బుల్లెట్ తగలడంతో ఆయన మృతి చెందారు. చత్తీస్ ఘడ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నందకుమార్ పటేల్ ను, అతని కుమారుడ్ని మావోలు అపహరించారు. అతనితో పాటూ మరో 10 మందికి పైగా కాంగ్రెస్ కార్యకర్తల్ని కూడా అపహరించారు. కేంద్ర మాజీ మంత్రి వీసీ శుక్లాకు బుల్లెట్ తగిలింది. వీరితో పాటూ మరి కొంతమంది గాయపడ్డ కార్యకర్తలను ఆసుపత్రులకు చికిత్స నిమిత్తం తరలించారు.