: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం


చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం పూతలపట్టు-నాయుడు పేట రహదారిపై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. లారీ-మినీ బస్సు ఢీ కోవడంతో అక్కడికక్కడే ఆరుగురు మృతి చెందగా, 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరు తిరుమల శ్రీవారిని దర్శించుకొని శ్రీకాళహస్తి వెళ్తూ ప్రమాదం బారిన పడ్డారు. క్షతగాత్రుల్లో పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె తీవ్రంగా గాయపడడం అందర్ని కలిచివేస్తోంది. కాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాదం బారిన పడ్డవారికి మెరుగైన వైద్యసాయం అందించాలని అధికారులను కోరారు. మరో వైపు మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు.

  • Loading...

More Telugu News