: అజిత్ జోగి వాహనంపై మావోల దాడి


ఛత్తీస్ ఘడ్, సుకుమా జిల్లాలో పరివర్తన్ యాత్రలో పాల్గొని వస్తుండగా కాంగ్రెస్ సీనియర్ నేత అజిత్ జోగి వాహనంపై మావోయిస్టులు దాడి చేసారు. ఈ దాడిలో నలుగురు కాంగ్రెస్ కార్యకర్తలు గాయపడ్డారు. అయితే అజిత్ జోగి క్షేమంగా ఉన్నారు. మరో ఘటనలో జగదల్ పూర్ జిల్లా దర్బా ఘాటీ రోడ్డులో పరివర్తన్ యాత్ర కోసం వెళ్తున్న కాంగ్రెస్ వాహనాలపై మావోలు కాల్పులు జరిపారు. నారాయణ పూర్ జిల్లా రేమావడ్ లో 1250 బీడీ ఆకు బస్తాలు నిల్వవుంచిన పాఠశాల భవనాన్ని పేల్చేశారు. సుకుమా జిల్లాలో తోంగ్ పాల్ వద్ద బాంబుపాతర అమర్చి పేల్చిన ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందాడు.

  • Loading...

More Telugu News