: బీసీసీఐ అధ్యక్షుడు ఎవరు?
స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో బీసీసీఐ అధ్యక్షుడిపై ఒత్తిడి పెరుగుతోంది. అల్లుడు ఫిక్సింగ్ కు పాల్పడడంతో శ్రీనివాసన్ పదవికి రాజీనామా చేయాలంటూ ఇంటా, బయటా విమర్శలు ఎదుర్కొంటున్నారు. మరో వైపు ప్రత్యర్థి వర్గాలైన సుబ్రతోరాయ్, శరద్ పవార్ వర్గం కూడా శ్రీనివాసన్ రాజీనామా చేసి తన సచ్ఛీలతను నిరూపించుకోవాలంటున్నారు. ఐపీఎల్ ముగిసాక జరిగే భేటీలో దీనిపైనే ప్రధానంగా చర్చించనున్నారు.
శ్రీనివాసన్ రాజీనామా చేస్తే అతని స్థానాన్ని భర్తీ చేసే అవకాశం టర్మ్ ప్రకారం సౌత్ కు బీసీసీఐ అధ్యక్షపదవి రావాలి కనుక శివలాల్ యాదవ్ ను బీసీసీఐ అధ్యక్షపదవి వరించే అవకాశం ఉంది. కానీ పవార్ వర్గం వారు ఈ అవకాశాన్ని వదులుకుంటారా ? అనేదే మిలియన్ డాలర్ క్వశ్చన్. అదే జరిగితే శశాంక్ మనోహర్ బీసీసీఐ అధ్యక్షపదవిని చేపట్టే అవకాశాన్నీ కొట్టిపారేయలేమని క్రికెట్ వర్గాలంటున్నాయి.