: అమెరికాలో తుస్సుమన్న 'ఫేస్ బుక్ ఫోన్'
స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ప్రభంజనం సృష్టిస్తుందంటూ మీడియా ఊదరగొట్టగా, ఆర్భాటంగా విడుదలైన 'ఫేస్ బుక్ ఫోన్' అమెరికాలో తుస్సుమనిపించింది. అమ్మకాల పరంగా ఈ ఫోన్.. కంపెనీకి తీవ్రనిరాశ మిగిల్చింది. ఫేస్ బుక్ సాఫ్ట్ వేర్ ఆధారిత ఈ హెచ్ టీసీ మొబైల్ గత నెలలో విపణిలో విడుదల కాగా.. ఇప్పటివరకు కొద్ది శాతం అమ్మకాలనే నమోదు చేసింది. ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్ బర్గ్.. తమ ఉత్పత్తి వినియోగదారులకు, ఫోన్ కు మధ్య సంబంధాన్ని పునర్నిర్వచిస్తుందని ఫోన్ ఆవిష్కరణ సందర్భంగా సెలవిచ్చిన సంగతి తెలిసిందే. అయితే, అమెరికా అమ్మకాల తీరును చూసిన యూరప్ డీలర్లు ఈ ఫోన్ అంటేనే హడలిపోతున్నారు. అందుకే, ఈ ఫేస్ బుక్ ఫోన్ ఇంతవరకు ఇంగ్లండ్ లో విడుదలకు నోచుకోలేదు.