Mamata Banerjee: బెంగాల్‌లో వ్యాక్సిన్ స‌ర్టిఫికేట్ల‌పై మ‌మ‌తా బెన‌ర్జీ ఫొటో!

mamata pic on vaccine certificate

  • అంత‌కు ముందు సర్టిఫికేట్‌పై మోదీ ఫొటో
  • అప్ప‌ట్లో టీఎంసీ అభ్యంత‌రాలు
  • టీఎంసీ చ‌ర్య‌ల‌పై బీజేపీ మండిపాటు

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి  ఇస్తున్న‌ సర్టిఫికేట్ పై ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ఫొటో ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు ప‌శ్చిమ బెంగాల్‌లో టీకా స‌ర్టిఫికేట్‌పై ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ ఫొటోను ప్రచురించడం గ‌మ‌నార్హం. మోదీ ఫొటోను తొల‌గించి మ‌రీ అదే స్థానంలో మమతా బెనర్జీ ఫొటోను ముద్రిస్తున్నారు.

దీనిపై ఆ రాష్ట్ర మంత్రి ఫిర్హాద్ హకీమ్ స్పందిస్తూ.. ఆ స‌ర్టిఫికేట్ల‌పై మ‌మ‌త ఫొటోను ప్ర‌చురించ‌డంలో తప్పు లేదని అన్నారు. కొన్ని రోజుల క్రితం టీకా సర్టిఫికేట్‌లో మోదీ ఫొటో ఉండ‌డంపై అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన టీఎంసీ అప్ప‌ట్లో ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసి, ఎన్నిక‌ల నియమావళిని బీజేపీ ఉల్లంఘించింద‌ని ఆరోపణ‌లు చేసింది.

అలాంటిడి ఇప్పుడు మోదీ ఫొటోను తీసేసి మ‌మ‌త ఫొటోను ముద్రిస్తుండ‌డం ప‌ట్ల బీజేపీ మండిప‌డుతోంది. మన పార్లమెంటరీ వ్య‌వ‌స్థ‌లో ప్రధానికి ప్ర‌త్యేక‌ స్థానం ఉందని, అయితే, ఆ స్థానాన్ని సీఎం ప‌రం చేయాల‌ని టీఎంసీ భావిస్తోంద‌ని బీజేపీ నేత‌ సామిక్ భట్టాచార్య విమ‌ర్శించారు.  

  • Loading...

More Telugu News