: ఎట్టకేలకు గురునాథ్ అరెస్టు


ఫిక్సింగ్ వ్యవహారంలో విస్మయకరరీతిలో తెరమీదికి వచ్చిన గురునాథ్ మెయ్యప్పన్ బెట్టింగ్ అభియోగాలపై అరెస్టయ్యాడు. గురునాథ్ నిన్న సాయంత్రం ఐదింటికి ముంబయి క్రైమ్ బ్రాంచ్ ముందు హాజరవ్వాల్సి ఉన్నా, అతడు ఎక్కడ ఉన్నాడో తెలియక ఉత్కంఠ నెలకొంది. అయితే, మధురై నుంచి ప్రత్యేక విమానంలో ముంబయి చేరుకున్న గురునాథ్ ను విమానాశ్రయంలోనే పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఉత్కంఠ వీడింది. అనంతరం అతడిని క్రాఫోర్డ్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. గురునాథ్ ను రాత్రి పొద్దుపోయే వరకు ప్రశ్నించిన క్రైమ్ బ్రాంచ్ అధికారులు అనంతరం అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు. నేడు కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News