: అమెరికా కీలక న్యాయమూర్తిగా ప్రవాస భారతీయుడు
అమెరికా రాజధాని నగరంలో ఉన్న ప్రతిష్ఠాత్మక యూఎన్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ న్యాయమూర్తిగా ప్రవాస భారతీయుడు ఎంపికయ్యాడు. శ్రీకాంత్ శ్రీనివాసన్ ను యూఎన్ సెనేట్ 97-0 ఓట్లతో న్యాయమూర్తిగా ఎన్నుకుంది. రెండు దశాబ్దాల పాటు లిటిగేటర్ గా పనిచేసిన శ్రీనివాసన్ ప్రిన్సిపల్ డిప్యుటీ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ గా నియమితులయ్యారని అధికారిక ప్రకటనలో శ్వేతసౌధం పేర్కొంది. అమెరికాలో సుప్రీంకోర్టు తరువాతి స్థానంలో కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ ఉంది. దీంతో ప్రవాసభారతీయుడు అమెరికాలో కీలక పదవీ బాధ్యతలు నిర్వర్తించేందుకు ఎంపికయ్యాడు.