: నిలిచిన బెట్టింగ్.. దారుణంగా దెబ్బతిన్న ఢిల్లీ బుకీలు


ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారం తెరపైకి రావడంతో దేశవ్యాప్తంగా బెట్టింగ్ కార్యకలాపాలు కాస్త మందగించాయి. బుకీలందరూ తేలుకుట్టిన దొంగల్లా మిన్నకుండిపోయారు. ముఖ్యంగా దేశరాజధాని ఢిల్లీలో బుకీలు వేలాది కోట్ల రూపాయల నష్టం చవిచూశారు. తాజా ఫిక్సింగ్ స్కాం వెలుగులోకి రావడంతో వీరందరూ ఒక్కసారిగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. దీంతో, భారీ ఎత్తున సాగే బెట్టింగ్ నిలిచిపోవడంతో రూ.35,000 కోట్ల మేర నష్టపోయారని తెలుస్తోంది. ఒక్క ఢిల్లీలోనే 1500 మంది బుకీలు ఉన్నట్టు సమాచారం. కాగా, ఐపీఎల్-6 ప్రారంభం నాటికి రూ. 50 వేల కోట్లు పలికిన బెట్టింగ్ దందా.. రాజస్థాన్ క్రికెటర్ల అరెస్టుతో రూ.15 వేల కోట్లకు పడిపోయిందని ఢిల్లీ పోలీసు వర్గాలు అంటున్నాయి.

  • Loading...

More Telugu News