: కేన్స్ లో రూ.14 కోట్ల నెక్లెస్ మాయం
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా దొంగలు పండుగ చేసుకుంటున్నారు. పారిస్ లో జరుగుతున్న ఈ పండుగ కోసం ప్రపంచవ్యాప్తంగా వివిద దేశాలకు చెందిన అతిరథ మహారథులైన నటీనటులు విచ్చేశారు. వీరు బస చేసిన హోటళ్లలో సెక్యూరిటీ ఎంతగా ఉన్నప్పటికీ చోర విద్యలో ఆరితేరిన వారు విలువైన వస్తువులను కొట్టేస్తూనే ఉన్నారు. ఐదున్నర కోట్ల రూపాయల విలువైన ఆభరణం హోటల్ గది నుంచి మాయమై వారం తిరగక ముందే మళ్లీ చోరులు తమ ప్రతాపం చూపించారు. ఫ్రెంచ్ రివీరియా హోటల్ నుంచి పద్నాలుగు కోట్ల ముప్పై లక్షల రూపాయల విలువైన నెక్లస్ ను తస్కరించారు. 80 మంది సెక్యూరిటీ గార్డులున్నా తమ పని తాము చేసుకునిపోయారు.