: నిరుద్యోగులకు శుభవార్త
నిరుద్యోగులకు రాష్ట్రప్రభుత్వం శుభవార్త వినిపించింది. రాష్ట్రప్రభుత్వంలో వివిధ విభాగాల్లో 70 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి రంగం సిద్దం చేసింది. జనరల్ విభాగంలో 34, 450 ఖాళీల భర్తీకి పచ్చజెండా ఊపింది. ఖాళీ భర్తీకి సంబంధించిన దస్త్రానికి ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. ఈ పోస్టుల భర్తీ ఎపీపీఎస్సీ, డీఎస్సీ, జిల్లా ఎంపిక కమిటీల ద్వారా పూర్తి చేయనున్నారు.
మరో వైపు ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టుల్లో 11,347 ఖాళీలు భర్తీ చేయనున్నారు. మొత్తం 75,522 పోస్టులు ఖాళీలు ఉండగా అందులో నేరుగా భర్తీ చేసేవి 44,427 కాగా, అందులో పదోన్నతులతో భర్తీ చేసేవి 31,095. ఇదిలా ఉండగా, ఆదాయపు పన్ను విభాగం పునర్ వ్యవస్థీకరణకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వివిధ కేడర్లలో 20,751 పోస్టులను భర్తీ చేయనున్నారు.