: మీకు అంగారక శిల కావాలా...!?
మీకు అంగారక గ్రహం పైన ఉన్న శిల కావాలా...? అయితే వెంటనే హెరిటేజ్ ఆక్షన్స్ సంస్థ వద్దకు వెళ్లండి. అక్కడ వారు వేసే వేలంలో అంగారక శిలను మీ సొంతం చేసుకోండి. మొరాకోలోని సహారా ఎడారిలో 2012లో ఒక ఉల్కను కనుగొన్నారు. అంగారక గ్రహం పైనుండి రాలిపడ్డ ఈ ఉల్కకు ఎన్‌డబ్ల్యూఏ 7397 అనే పేరు పెట్టారు. ఈ ఉల్కను ఇప్పుడు వేలానికి పెట్టారు.
జూన్ 2న హెరిటేజ్ ఆక్షన్స్ సంస్థ ఈ అంగారక శిలను వేలం వేయనుంది. వేలంలో ఈ శిల సుమారు 1.6 లక్షల డాలర్లకు అమ్ముడయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ శిలతోబాటు ఇంకా అనేక శిలాజాలను కూడా వేలానికి పెట్టనున్నట్టు సంస్థ అసోసియేట్ డైరెక్టర్ క్రెయిగ్ కిస్సిక్ చెబుతున్నారు. కాబట్టి ఇలాంటి శిలలు, శిలాజాలు కావాలనుకునేవారు వెంటనే వేలం పాటలో పాల్గొనేందుకు బయల్దేరండి!