: మరికొంత గడువివ్వండి: బీసీసీఐ చీఫ్ అల్లుడు
ఫిక్సింగ్ కేసులో ఆరోపణలెదుర్కొంటున్న బీసీసీఐ ఛీఫ్ అల్లుడు గురునాథ్ మెయ్యప్పన్ అజ్ఞాతం వీడారు. నేడు ముంబయి పోలీసులు ఆయన ఇంటిలో సోదాలు నిర్వహించిన సమయంలో అందుబాటులో లేకుండా పోయారు. దీంతో, పోలీసులు నోటీసులను ఆయన నివాసంలో అందించారు. రేపు ఉదయం విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు. ఈ విషయమై గురునాథ్ ఈ సాయంత్రం స్పందించారు. విచారణకు మరికొంత సమయం కావాలని, సోమవారం హాజరవుతానని తెలిపారు.