: చండీలా.. గుండెలు తీసిన బంటు!
స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో శ్రీశాంత్ తో పాటు అరెస్టయిన గుజరాత్ క్రికెటర్ అజిత్ చండీలా అవినీతి లీలలు తాజా సీజన్ కే పరిమితం కాలేదంటున్నారు ఢిల్లీ పోలీసులు. వారి విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చండీలా గత ఐపీఎల్ సీజన్లోనూ ఫిక్సింగ్ కు పాల్పడ్డాడని పోలీసులు వెల్లడించారు. ఓ మ్యాచ్ లో ఫిక్సింగ్ చేసినందుకు గాను చండీలాకు రూ.12 లక్షలు ముట్టాయని వారు తెలిపారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న బుకీ సునీల్ భాటియా ఈ వివరాలు బయటపెట్టాడు. ఐపీఎల్-5లో ఇతర ఆటగాళ్ళను ప్రలోభపెట్టాలని భావించినా, సాధ్యంకాలేదని భాటియా వెల్లడించాడు.