: అది ఐపీఎల్ కాదు... గ్యాంబ్లింగ్


ఇండియన్ ప్రీమియర్ లీగ్ జూదానికి నెలవుగా మారిందని బీజేపీ నేత యశ్వంత్ సిన్హా అన్నారు. ఇందులో క్రికెట్ కన్నా గ్యాంబ్లింగ్ ఎక్కువ జరుగుతోందని ఆరోపించారు. స్పాట్ ఫిక్సింగ్ కొందరు ఆటగాళ్ళకు, బుకీలకే పరిమితం కాలేదని, అంతటా వ్యాపించి ఉందన్నారు. గత ఐపీఎల్ ఎడిషన్లో కూడా ఫిక్సింగ్ జరిగిందన్నారు. ఐపీఎల్ మ్యాచ్ లు క్రికెట్ స్వరూపాన్నే మార్చేశాయని, ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరపాలని సూచించారు. క్రికెట్ ప్రతిష్ఠను మంటగలిపినవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసారు.

  • Loading...

More Telugu News