: అలీకి పౌరసన్మానం చేస్తామంటున్న స్వస్థలం వాసులు
ప్రముఖ తెలుగు సినీ హాస్యనటుడు అలీకి గౌరవడాక్టరేట్ రావడంపై అతని స్వస్థలమైన రాజమండ్రిలో హర్షం వ్యక్తమౌతోంది. చలనచిత్ర పరిశ్రమలో వెయ్యి సినిమాలకు పైగా నటించిన అలీకి డాక్టరేట్ రావడం ఆనందించదగ్గ విషయమని, త్వరలోనే భారీ బహిరంగ సభ ఏర్పాటుచేసి పౌరసన్మానం ఏర్పాటు చేస్తామని ఆయన బంధువులు, అభిమానులు తెలిపారు. అలాగే అలీకి పద్మశ్రీ ప్రకటించాలని కూడా వారు కోరారు.