: మరో రెండు రోజులు నిప్పుల కుంపటి కానున్న రాష్ట్రం
మరో రెండు రోజుల పాటు భానుడు తన ప్రతాపం చూపనున్నాడు. ఇప్పటికే రాష్ట్రాన్ని నిప్పుల కుంపటి చేసిన సూర్యుడు మరో రెండు రోజులు ఉగ్ర రూపం చూపుతాడని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. భానుడి భగభగలకి పగలు బయటకి వెళ్ళాలంటే ప్రజలు భయపడిపోతున్నారు. కోస్తాంధ్ర, తెలంగాణ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయనీ, బయటకు వెళ్లాలంటే కనీసం టోపీ అయినా ధరించాలని, ఎప్పటికప్పడు నీళ్లు తాగాలని, ఎండలో ముఖానికి గుడ్డ అడ్డం పెట్టుకోవాలని, మిట్టమధ్యాహ్నం రోడ్లమీద తిరగడం మంచిది కాదని ఆరోగ్యశాఖాధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితి మరో రెండు రోజులు ఉంటుందని జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.