Bhupender Yadav: బీహార్ ఎన్నికల్లో చక్రం తిప్పిన నేతకు జీహెచ్ంఎసీ ఎన్నికల బాధ్యతలు...బీజేపీ కీలక నిర్ణయం!

BJP asks Bhupender Yadav to drive the forces in GHMC elections

  • బీహార్ లో బీజేపీ విజయం
  • బీజేపీని నడిపించిన భూపేందర్ యాదవ్
  • త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు

దుబ్బాక ఉప ఎన్నికల్లో సాధించిన విజయం తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చింది. ఏ ఎన్నికల్లోనైనా అధికార టీఆర్ఎస్ పార్టీని ఢీకొట్టే ఆత్మవిశ్వాసాన్ని అందించింది. ఏ నిమిషాన్నయినా జీహెచ్ఎంసీ ఎన్నికల నగారా మోగనున్న నేపథ్యంలో బీజేపీ  అధినాయకత్వం ఈ దిశగా దృష్టి సారించింది.

బీహార్ ఎన్నికల్లో అన్నీతానై బీజేపీని నడిపించిన రాజస్థాన్ కు చెందిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేందర్ యాదవ్ ను జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ పార్టీని నడిపించాలని కోరింది. జీహెచ్ఎంసీ ఎన్నికల ముంగిట పార్టీని మరింత దృఢతరం చేయాలని, టీఆర్ఎస్ ను ఓడించేలా గెలుపు వ్యూహాలు పన్నాలని ఆయనకు సూచించింది.

రాజ్యసభ సభ్యుడైన భూపేందర్ యాదవ్ కు వ్యూహచతురుడన్న పేరుంది. ప్రస్తుతం ఆయన బీహార్ లో బీజేపీ వ్యవహారాల ఇన్చార్జిగా ఉన్నారు ఇటీవల ముగిసిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తేజస్వియాదవ్ ప్రభావాన్ని పరిమితం చేయడంలోనూ, ఎన్డీయేలో బీజేపీని అతిపెద్ద పార్టీగా నిలపడంలోనూ భూపేందర్ ప్రజ్ఞాపాటవాలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 125 స్థానాలు దక్కగా, వాటిలో బీజేపీ వాటా 74 స్థానాలంటే భూపేందర్ పనితీరు అర్థమవుతుంది. సీఎంగా మరోసారి పీఠమెక్కిన నితీశ్ కుమార్ కు చెందిన జేడీయూ గెలిచింది 42 స్థానాలే. అందుకే, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ బాధ్యతలను భూపేందర్ కు అప్పగించినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News