: డెల్టాకు 72గంటల్లో నీరివ్వాలి: చంద్రబాబు అల్టిమేటం
కృష్ణా పశ్చిమ డెల్టాకు తక్షణం నీరివ్వాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రభుత్వాన్నిడిమాండ్ చేశారు. ఇందుకు మూడు రోజుల గడువు (72గంటలు) ఇచ్చారు. లేకుంటే 18న గుంటూరు జిల్లాలో మహాధర్నాకు దిగుతామని ఆయన హెచ్చరించారు. నీటి విడుదల విషయమై తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఈ రోజు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ ను కలువనున్నారు. ఇదే అంశంపై రేపు గవర్నర్ నూ కలవాలని నిర్ణయించారు.